కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు.. భారీ ర్యాలీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
ఎటపాక, నవంబర్ 21 (మన సమగ్ర ప్రజావాణి):
ఎటపాక మండలంలోని త్రిపురపెంటవీడు, తోటపల్లి గ్రామ పంచాయతీల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఘనంగా నామినేషన్లు దాఖలు చేశారు. త్రిపురపెంటవీడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పలకా రేణుక, తోటపల్లి గ్రామంలో జనసేన పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బైరు వెంకటరమణ నామినేషన్లు సమర్పించారు. ఈ రెండు పంచాయతీలకు చెందిన 18 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడియాల వెంకటేశ్వరరావు, తోటపల్లి టీడీపీ ఎంపీటీసీ పూసం రాఘవయ్య, మాజీ సర్పంచ్ మోసం రాజుల ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు, యూనిట్ ఇన్చార్జి బాచినేని మల్లేశ్వరరావు, జనసేన పార్టీ ఎటపాక మండల అధ్యక్షుడు మారసు గంగాధర్, త్రిపురపెంటవీడు గ్రామ పార్టీ అధ్యక్షుడు దుద్దుకూరి సతీష్, తోటపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు నలజాల వెంకన్న పాల్గొన్నారు.
అలాగే బూత్ కన్వీనర్లు వల్లభనేని నరసింహారావు, నలజాల శ్రీనివాస్, దుద్దుకూరి నగేష్, ఆపకా రాంబాబు, పూరేటి వెంకన్న, నలజాల ప్రసాద్, బొలుసు సుబ్బారావు, కడియాల వెంకట్, కుచ్చలపాటి కొండయ్య, కొట్టే బాబు, గజ్జల బాలయ్య, ముసరి రాము, నలజాల కోటి, రావి విజయ్, దుద్దుకూరి రమేష్, వల్లభనేని సాయి కళ్యాణ్, కిరణ్, చల్లగురుగుల శ్రీను, మర్లపాటి రాజు, బైరు రాంబాబు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

