📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవిధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వైద్యుల పై సస్పెన్షన్ వేటు

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వైద్యుల పై సస్పెన్షన్ వేటు

📰 Generate e-Paper Clip

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వైద్యుల పై సస్పెన్షన్ వేటు

జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్

విధులకు గైహాజరుపై కొరడా…!

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

విధుల పట్ల నిర్లక్ష్యం వహించి, సమయపాలన పాటించని మధిర ఏరియా ఆసుపత్రికి చెందిన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న మధిర ఏరియా ఆసుపత్రిలో జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ నిర్వహించిన సమావేశంలో వైద్యులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ, శుక్రవారం (20.11.2026) నాడు నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రి కార్యకలాపాలకు, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించామని తెలిపారు.

మధిర ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం, తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనలు-1991 లోని రూల్ 8(1)(ఎ) కింద నలుగురు వైద్యులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో డిప్యూటీ సివిల్ సర్జన్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ కె. అనిల్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (పిడియాట్రిక్స్) డాక్టర్ డి. శ్రీను, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (ఆర్థోపెడిక్స్) డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (రేడియాలజీ) డాక్టర్ పి. శ్రీకాంత్ ఉన్నారన్నారు.

సస్పెన్షన్ కాలంలో వీరందరి హెడ్ క్వార్టర్స్ ఖమ్మంగా నిర్ణయించబడిందని, ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే, తమ వద్ద ఉన్న రికార్డులు, ఫైళ్లు, పరికరాలను మెడికల్ సూపరింటెండెంట్ సూచించిన అధికారికి అప్పగించాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని, వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కేంద్ర ఆసుపత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.