మాడుగులపల్లి
మాదిగ స్టూడెంట్ పెడరేషన్ MSF మండల అధ్యక్షుని గా వంటేపాక వినయ్ మాదిగ…
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20
ఈ రోజు మాడ్గులపల్లి మండలం కేంద్రం లో ఏర్పాటు చేసిన మాదిగ విద్యార్థుల మండల సమావేశానికి ముఖ్య అతిథిగా MSF నల్గొండ జిల్లా ఇంచార్జ్ నూకపంగా మోహన్ మాదిగ హాజరై విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతూ
విద్యతోనే మాదిగ విద్యార్థుల భవిష్యత్ ముడిపడి ఉంది కాబట్టి బాగా చదువుకొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మన కోసం సాంధించిన ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలను అందిపుచ్చుకోని విద్య, ఉద్యోగ ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరాలి అని అదే విధంగా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మండల MSF కమిటీలు పూర్తి చేయాలి అని సూచించారు. అంతరం నూతన మండల కమిటీ నిర్మాణం చేశారు మండల అధ్యక్షునిగా వంటే పాక వినయ్ మాదిగ ఉప అధ్యక్షునిగా బొంగరాల మహేందర్ మాదిగ ప్రధాన కార్యదర్శిగా పృథ్వి మాదిగను నియమించారు.

