జాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్
మద్దూరు నవంబర్20, ప్రజా వాణి,
దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ మాజీ ప్రదాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం గ్రామంలో స్థానిక సర్పంచ్ కమలాకర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించి, కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ తెలిపారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇలాంటి పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందకుండా సంబంధిత అధికారులకు సహకరించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్,సర్పంచుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ యాదవ్ రాష్ట్ర ప్రబుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి గ్రామపంచాయతీ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఫహీం, ఎంపీఓ మోహన్ ,ఉప సర్పంచ్ పరుశరాంగౌడ్ ,వార్డ్ సబ్యులు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు,జూనియర్ అసిస్టెంట్,ఆపరేటర్లు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

