*వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి*
*టిఎన్జీఓ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం*
* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కోరారు. ఈమేరకు శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో టిఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు నాణ్యమైన నిత్యావసర సరుకుల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా చూడడంతో పాటు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వసతి గృహాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు అందేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోసిన్, కార్యదర్శి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
*హాజీపూర్ లో టీఎన్జీవో సభ్యత్వ నమోదు*
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ లో పంచాయతీ రాజ్ శాఖ హాజీపూర్ ఎంపిడిఓ కార్యాలయంలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో టిఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని ఇంకా మిగిలిన యూనిట్లో సభ్యత్వ నమోదును అతి తొందరలోనే పూర్తి చేసి, రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంచడం తోపాటు అదేవిదంగా రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు నరేందర్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, మందమర్రి యూనిట్ అధ్యక్షులు సుమన్, పంచాయతీ రాజ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

