📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonడ్రగ్స్ కు దూరంగా ఉండండి.. చదువుపై దృష్టి పెట్టండి... డిసిపి రాజమహేంద్ర...

డ్రగ్స్ కు దూరంగా ఉండండి.. చదువుపై దృష్టి పెట్టండి… డిసిపి రాజమహేంద్ర నాయక్ ఐపిఎస్

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా అఖిల భారత రైతు సంఘం – ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ లో వ్యాసరచన పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రధానం, డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమానికి అఖిల భారత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా హాజరైన జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ ఐపిఎస్ మాట్లాడుతూ, విద్యార్థులు డ్రగ్స్, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజం తీవ్రంగా నష్టపోతాయని, యువత వాటికి వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు మాట్లాడుతూ, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, యువత రాజ్యాంగ విలువలు, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, టీపీఎస్కె సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ సాంబరాజు యాదగిరి, అవాజ్ జిల్లా కన్వీనర్ మహమ్మద్ అజారుద్దీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, అఖిల భారత రైతు సంఘం, ఎస్ఎఫ్ఐ నాయకులు ఉపాధ్యక్షులు మామిడాల రమేష్, నల్ల సాత్విక్ రెడ్డి, జిల్లా గర్ల్స్ కన్వీనర్ కడారి మానస, జిల్లా కమిటీ సభ్యులు గొడుగు రమేష్, జిల్లా నాయకులు సాయి తేజ, యశ్వంత్, మురళి కృష్ణ, జశ్వంత్, ప్రకాష్, సుశాంత్, గండి అంజయ్య, మంగ బీరయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.