📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేసంగిలో వరి సాగు చేయవద్దు: మరియన్న

వేసంగిలో వరి సాగు చేయవద్దు: మరియన్న

📰 Generate e-Paper Clip

వేసంగిలో వరి సాగు చేయవద్దు: మరియన్న
ప్రజావాణి,నెల్లికుదురు:ఎల్ నినో, వర్షాభావ పరస్థితుల దృష్ట్యా వేసంగి లో వరి సాగుకు పాల్పడవద్దని జిల్లా విద్యాలయ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని మునిగలవేడులో శుక్రవారం బెండ, వంగ,మిరప పంటలను క్షేత్రస్థాయిలో ఆయన సందర్శించి రైతులకు అవగాహన కల్పించారు.ఉద్యాన, కూరగాయలు, ఆయిల్ పామ్, మిరప,మల్బరీ సాగు, వాటి సాగులో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్దతులపై క్షేత్ర సందర్శన లో వివరించారు.

*వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలి*

రైతులు వరికి బదులుగా కూరగాయలు, మల్బరీ మొదలైన ఆరు తడి పంటలను యాసంగిలో సాగు చేయుటకు సమీప ఉద్యాన అధికారిని సంప్రదించి బిందు సేద్యం, మల్చింగ్ మొదలైన పధకాల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని మరియన్న రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు నాగేశ్వరరావు,సంపత్ రెడ్డి,సీతారాములు,హరిసింగ్, నాగన్న, ఫీల్డ్ అధికారి నర్మద, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.