సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలి వినతి
మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి (నవంబర్ :20)
సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని కోరుతూ జన జాగృతి సేన ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్. ఎం. ఓ. రవి కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ 500 పడకలు ఉన్న సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అయిన కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో, ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందాక పోవడం వల్ల సంగారెడ్డి లో డాక్టర్స్ రోగులను గాంధీ, ఉస్మానియా హాస్పిటల్ రెఫెర్ చేస్తున్నారు అన్నారు.. హైదరాబాద్ వెళ్లలేని కొంత మంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి ఆర్ధికంగా నష్టపోతున్నారు కావున ప్రభుత్వం వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బేగరి కరుణాకర్, జన జాగృతి సేన కార్యదర్శి చింతల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

