జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ విద్యార్థినికి ప్రథమ బహుమతి
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20
భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ – 2026 కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A)లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన మరియు క్విజ్ పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ – 5086 విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ పోటీలలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్‌కు చెందిన విద్యార్థిని ఎం. రాధిక B. Sc ( MPC ) ప్రథమ బహుమతి సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా రాధిక బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ విద్యా, సాంస్కృతిక, క్రీడా మరియు వివిధ పోటీ పరీక్షల రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ రోజురోజుకూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు అధ్యాపక బృందం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
విద్యార్థిని రాధిక సాధించిన ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

