జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి):రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం కామారెడ్డిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ చింత రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా డిపిఓ వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు, భూమి లేని నిరుపేదలకు ఈ బీమా పథకం చాలా ఉపయోగకరమైందని అన్నారు. ఈ పథకం ప్రారంభించడం రాష్ట్రంలోని పేద ప్రజలు హర్షించదగ్గ విషయమని కొనియాడారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల ఎంపీవో శ్రీనాథ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ రిజ్వాన్ సిరాజ్, గొల్లపల్లి కార్యదర్శి భాస్కర్, మన్ పహాడ్ కార్యదర్శి ప్రశాంత్ ఆచార్య మరియు ఉప సర్పంచ్ పులిపంపుల భాస్కర్, వార్డు సభ్యులు ఎల్లబోయిన గిరియాదవ్, చింత లక్ష్మయ్య, చింత అశోక్, లింగాల హరీష్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

