📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

– సిద్ధిపేట వేదికగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

* పెన్షన్ లతో పేదవారికి చేయూత ఇస్తున్నాం

* కుల,మత,ప్రాంత,రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు

* కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్

* కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో

జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాఇల్లంతకుంటమండలంలోనిబడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి,పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేసి,దేశ ఐక్యత,సమగ్రత కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం రోజున ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రణవ్ పాల్గొని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమపథకంఅందజేస్తామని,నియోజకవర్గానికి కొత్తగా 4,336 పెన్షన్.మంజూరుఅయ్యాయని,సిద్ధిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిర భీమా పథకాన్ని ప్రారంభిస్తారని అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ,నూతనంగా పెన్షన్ మంజూరు అయిన వారికి నిధులు మంజూరు చేస్తారని తెలిపారు.సిద్ధిపేట వేదికగా జరిగే ఈ బహిరంగ సభకు భారీ స్థాయిలో పార్టీనాయకులు పాల్గొంటున్నారని అన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగానెరవేరుస్తున్నామని ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.