📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా టిజిఇ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ

ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా టిజిఇ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నెరవేర్చేలా టిజిఇ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ…

జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పోలేపల్లిలో నిర్మిస్తున్న టిజిఇ హైట్స్ రెసిడెన్షియల్ గేటెడ్ టౌన్‌షిప్‌ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గృహ సముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టీజీ గెజిటెడ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన గేటెడ్ కమ్యూనిటీలో కల్పిస్తున్న మౌళిక సదుపాయాలు, ఇతర వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పూర్తయిన మోడల్ ఫ్లాట్‌ను పరిశీలించి, అందులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ
పోలేపల్లి రెవెన్యూ పరిధిలో మున్నేరు నది ఒడ్డున వున్న ఈ గృహ సముదాయంలో మొత్తం 8 బ్లాకులు, ఒక్కో బ్లాక్‌లో 9 అంతస్తులు, ప్రతి అంతస్తులో 8 ఫ్లాట్ల చొప్పున మొత్తం 576 ఫ్లాట్లు వున్నట్లు తెలిపారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అవసరమైన మౌళిక సదుపాయాలు, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, టీజీవో హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి శేషు ప్రసాద్, డా. విజయ్ కుమార్ , ఖమ్మం జిల్లా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు యర్రా రమేష్, జాయింట్ సెక్రటరీ తాళ్లూరి శ్రీకాంత్, ఏలూరి కోణార్ ఖమ్మం జిల్లా టీజీఓ అధ్యక్ష కార్యదర్శలు కొంగర వెంకటేశ్వర రావు, మోదుగ వేలాద్రి, సూరంపల్లి రాంబాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దారు వినేందర్ రెడ్డి, అధికారులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.