📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకమలాపూర్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

కమలాపూర్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

📰 Generate e-Paper Clip

కమలాపూర్‌లో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

ఈ నెల 22 నుంచి 24 వరకు క్రీడా సంబరాలు ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల రాజేందర్

ప్రజావాణి నవంబర్ 19

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఆవరణలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు

పోటీల ప్రారంభ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా జిల్లా స్థాయి అధికారులు సైతం పాల్గొననున్నారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు కమలాపూర్ గూడూరు గ్రామాలను వేదికలుగా ఎంపిక చేసిన రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ పోటీల నిర్వహణకు చొరవ చూపిన రాష్ట్ర కార్యదర్శి రమణ ఎర్రగట్టు స్వామి సిరికొండ సుదర్శన్‌లను అభినందించారు. అలాగే పోటీల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు క్రీడాభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు

గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం

కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలకు పునర్వైభవం తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్న క్రీడాకారులను వారు అభినందించారు ఈ క్రీడా కార్యక్రమానికి గ్రామస్తుల తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు

ఖేలో ఇండియాలో బ్యాడ్మింటన్‌కు గుర్తింపు కల్పించాలి

బ్యాడ్మింటన్ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పాఠశాల స్థాయి క్రీడా పోటీలతో పాటు ఖేలో ఇండియా కార్యక్రమంలోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ నెల 22 నుంచి 24 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు క్రీడాకారులు ప్రజాప్రతినిధులు యువత క్రీడాభిమానులు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని నిర్వాహకులు కోరారు

ఈ సమావేశంలో కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ బండి కళాధర్ బాలసాని రమేష్ రవి రామకృష్ణ ప్రతాప్ మార్క అశోక్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.