రాయన్నపేట ( సర్పంచ్) స్వతంత్ర అభ్యర్థిగా….
తెల్లం నాగరాజు!
పంచాయతీ సమగ్ర అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం!
యువతకు మహిళలకు పేదలకు అండగా ఉంటా. తెల్లం. నాగరాజు
మన ప్రజావాణి!నవంబర్ 19. ఎటపాక మండలం…
పోలవరం జిల్లా ఎటపాక మండలం రాయన్నపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో యువకుడు విద్యావంతుడు ప్రజలకు సుపరిచితుడైన తెల్లం నాగరాజు స్వతంత్ర అభ్యర్థి ని లు స్తున్నారు. పంచాయతీని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడంతోపాటు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు..!!
ఈ సందర్భంగా తెల్లం నాగరాజు మాట్లాడుతూ.
గ్రామ ప్రజల ఆధార అభిమానాలు ఆశీస్సులతో ముందుకు సాగుతున్నానని తెలిపారు రాయనపేట పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడమే తన జీవిత లక్ష్యం అనే పేర్కొన్నారు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు…
ఎలాంటి పదవి వ్యామోహం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెల్లం నాగరాజు తెలిపారు.
గ్రామ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.
రాయనపేట పంచాయతీ అభివృద్ధికి. తనకు ఒక అవకాశం కల్పించి ఆదరించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు

