నెల్లుట్ల గ్రామంలో అయ్యప్ప స్వాములకు వంట సామాగ్రి అందించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో అయ్యప్ప స్వాములకు వంట సామాగ్రిని సర్పంచ్ నర్సింగ రామకృష్ణ గురువారం అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో స్వాములకు ఇచ్చిన మాట ప్రకారం వంట సామాగ్రిని అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన అన్నారు.
అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తుల సేవలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. స్వాములకు సేవ చేయడం ద్వారా గ్రామానికి శుభం చేకూరుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్వాములు సర్పంచ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో భక్తి భావంతో కూడిన ఇలాంటి కార్యక్రమాలు జరగడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు మెంబర్స్ వంగ సతీష్, బత్తిని వేణు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నర్సింగ రమేష్, మండల కార్యదర్శి బత్తిని అశోక్, నాయకులు కుర్రేముల రమేష్, మారబోయిన ఉపలయ్య, వేణు, గొరిగే మధు, గురుస్వామిలు గుర్రం బాలరాజ గురుస్వామి, గొరిగే మల్లయ్య గురుస్వామి, జిగురు ఉపేందర్ స్వామి, రాజు స్వామి, ప్రణయ్ స్వామి, మల్లేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

