📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకమలాపూర్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

కమలాపూర్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

కమలాపూర్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం అర్హులైన లబ్ధిదారులకు బీమా భరోసా

ప్రజావాణి నవంబర్ 19

భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలను హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత పరిరక్షణతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఆమె ధైర్యసాహసాలు నాయకత్వ పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని అన్నారు

అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు నాయకులు తెలిపారు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ మాజీ ఎంపీపీలు మాట్ల రమేష్ తడక శ్రీకాంత్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుమారస్వామి పోడేటి బిక్షపతి బొల్లం రాజిరెడ్డి కెత్త రవి కనకరత్నం పల్లె సమ్మిరెడ్డి, జైచందర్ ఇనుగాల బిక్షపతి పరశురాములు పుల్ల శోభన్ ఉప సర్పంచులు పుల్ల శీను, బందెల భరత్ కుమార్ వార్డు సభ్యులు గంధసిరి అనిల్ ఎల్కటి అనిల్ మండ యాలాలు బండి కుమారస్వామి పూజారి రమేష్ గుంటాల రవి సుగిన విజయేందర్ నిగ్గుల లింగయ్య చిలువేరు రవి చిరుత సుధాకర్ మిట్టపల్లి చంద్రమౌళి గూడూరు శ్రీనివాస్ కృష్ణమూర్తి మాట్ల కళ్యాణ్ అబ్బర వేణి అనిల్ దేశిని ప్రవీణ్ రాజు పెరక రమేష్ జిల్లా పెళ్లి రవీందర్ తాళ్ల పెళ్లి తిరుపతి గౌడ్ ఎగ్గోజు రమణాచారి బండి రాజేష్ కరుణాకర్ తదితరులతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.