📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనర్సాపూర్ రైతులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

నర్సాపూర్ రైతులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

📰 Generate e-Paper Clip

నర్సాపూర్ రైతులతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్
దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి):
మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో నీరందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఇటీవల తన పొలానికి నిప్పు పెట్టుకున్న ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సాపూర్ గ్రామ రైతులతో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్ కుమార్ మాట్లాడుతూ.. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో సాగునీరు అందక సుమారు 80 శాతం పంటలు ఎండిపోయాయని, పొలాలు నెర్రలు బారి బీడువారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేగా దివాకర్ రావు ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుచూపుతో సాగునీటిని విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు.
ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసమర్థ పాలన వల్లే మంచిర్యాల నియోజకవర్గంలో వేల ఎకరాల పంటలు ఎండిపోయాయని విమర్శించారు. కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రైతులకు గతంలో 24 గంటల విద్యుత్ అందించిన కేసీఆర్ ప్రభుత్వానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం రోజుకు ఆరు గంటలే విద్యుత్ ఇస్తోందని విమర్శించారు. సాగునీరు అందించలేని ప్రభుత్వం రైతులను పంటలు వేయవద్దని సూచించడం సరికాదన్నారు. తెలంగాణలో ఏర్పడిన కరువు ప్రకృతి వల్ల వచ్చినది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన కరువని ఆరోపించారు.
రైతుల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ, వ్యక్తిగత వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే రైతాంగ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికైనా మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.