📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపిల్లల ఊహలకు పుస్తకాలు ప్రాణం పోస్తాయి: కస్తూరి ప్రభాకర్

పిల్లల ఊహలకు పుస్తకాలు ప్రాణం పోస్తాయి: కస్తూరి ప్రభాకర్

📰 Generate e-Paper Clip

పిల్లల ఊహలకు పుస్తకాలు ప్రాణం పోస్తాయి: కస్తూరి ప్రభాకర్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18

​అడవిదేవులపల్లి,
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అడవిదేవులపల్లి జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో నూతన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.
​ఈ కార్యక్రమానికి ఎంఈఓ (M.E.O) మరియు ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, గ్రంథాలయ ఉద్యమ ప్రచారకులు కస్తూరి ప్రభాకర్, మిర్యాలగూడ గ్రంథాలయాధికారి కుమ్మరికుంట్ల సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
​ఈ సందర్భంగా కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. పుస్తకాలు పిల్లల ఊహలకు ప్రాణం పోస్తాయని, పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్య, విజ్ఞాన పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాల ఆవశ్యకతను వివరిస్తూ, పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ నూతన గ్రంథాలయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు సిబ్బంది ఎస్. శ్రీనివాస్ రావు, ఏ. ఉమాశంకర్, ఎస్. మునీశ్వరి, బి. సూర్యకాంతం, సీహెచ్. శోభ, ఎల్. శీనయ్య, డి. విద్యాచంద్ర నాయక్, ఏ. రాజ్యలక్ష్మి, పి. భారతి, ఈ. లోక్య నాయక్, ఎం. అరుణ, ఏ. శ్రీను, పి. కృష్ణబాబు, ఎస్కే. అమీరుద్దీన్, కూడా కృష్ణవేణి, జి. రేణుక, బి. శ్రీను, ఎస్. శ్రీశైలం, డి. సైదా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.