ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై సమావేశం
మద్దూరు నవంబర్18, ప్రజా వాణి,
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కొరకు ఏర్పాట్లు మరియు జలసిరి పనుల గురించి ఎంపీడీవో సిహెచ్ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శులు,వి బి జి రామ్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కొరకు ప్రతి గ్రామంలో గ్రామపంచాయతీలో ఒక శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ శిబిరాలకు పంచాయతీ కార్యదర్శులు లేక జిపిఓలు ఇన్చార్జి అధికారులుగా వ్యవహరిస్తారు.రెండు గ్రామాలకు ఒక సూపర్వైజర్ ను కేటాయించారు. మరియు జలసిరి పనుల యొక్క ప్రగతి గురించి సమీక్షించారు.ఈకార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు,ఏపిఓ మంజుల,తహసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శులు జిపిఓలు మరియు క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

