నాగల్ గావ్ పాఠశాలలో బాలల దినోత్సవ ఘనంగా వేడుకలు స్వయం పాలన దినోత్సవం..
గ్రామ సర్పంచ్ భర్త జాదవ్ విజయ్ పటేల్ ఆధ్వర్యంలో
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని నాగల్గవ్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. గ్రామసభ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిన్నారులతో కలిసి బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొని, వారి సమస్యలు, అవసరాలు మరియు అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యం మరియు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని సర్పంచ్ భర్త జాదవ్ విజయ్ పటేల్ తెలియజేయడం జరిగింది. సర్పంచ్ భర్త చేతుల మీదుగా
అనంతరం చిన్నారులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ సందర్భంగా జాదవ్ విజయ్ పటేల్ మాట్లాడుతూ…
నేటి బాలలే రేపటి భారత పౌరులు. వారి అభివృద్ధే మన గ్రామ అభివృద్ధి!
బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
సర్పంచ్ భర్త విజయ్ పటేల్ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. అనిల్, ప్రధానోపాధ్యాయులు కోటగిరి బాలచంద్రం తదితరులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు పాల్గొన్నారు..

