పిల్లల ఊహలకు పుస్తకాలు ప్రాణం పోస్తాయి: కస్తూరి ప్రభాకర్

పిల్లల ఊహలకు పుస్తకాలు ప్రాణం పోస్తాయి: కస్తూరి ప్రభాకర్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 18 ​అడవిదేవులపల్లి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అడవిదేవులపల్లి జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో నూతన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ​ఈ కార్యక్రమానికి ఎంఈఓ (M.E.O) మరియు ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, గ్రంథాలయ ఉద్యమ ప్రచారకులు కస్తూరి ప్రభాకర్, మిర్యాలగూడ గ్రంథాలయాధికారి కుమ్మరికుంట్ల సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ​ఈ సందర్భంగా కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. పుస్తకాలు పిల్లల ఊహలకు...