📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామ అభివృద్ధికి మాకునూర్ వర లక్ష్మి ప్రత్యేక చొరవ

గ్రామ అభివృద్ధికి మాకునూర్ వర లక్ష్మి ప్రత్యేక చొరవ

📰 Generate e-Paper Clip

*గ్రామ అభివృద్ధికి మాకునూర్ వర లక్ష్మి ప్రత్యేక చొరవ*

*దత్తసాయి ఆలయ ఆవరణలో నాలుగు మరుగుదొడ్లకు శంకుస్థాపన.. వర్షపు నీటి సంరక్షణకు ఆరు ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో సారంగాపూర్ నవంబర్ 18:-
సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు గ్రామ సర్పంచ్ మాకునూర్ వర లక్ష్మి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని దత్తసాయి ఆలయ ఆవరణలో వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా నాలుగు మరుగుదొడ్డి గదుల నిర్మాణానికి సర్పంచ్ మాకునూర్ వర లక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. అదేవిధంగా వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ లక్ష్యంగా గ్రామంలో ఆరు ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
గ్రామ అవసరాలను గుర్తించి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మిర్ధా సాయన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేందర్ సింగ్, టెక్నికల్ అసిస్టెంట్ పోశెట్టి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ రెడ్డి, దత్తసాయి ఆలయ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామస్టులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.