📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజా సమస్యలపై పోరుబాట.. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం

ప్రజా సమస్యలపై పోరుబాట.. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

**ప్రజా సమస్యలపై పోరుబాట.. బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం!**

ఇల్లంద, నవంబర్ 18:
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ పిలుపునిచ్చారు.

వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లందలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు అడుప రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గంట రవికుమార్, రాష్ట్ర సహా సంఘటన మంత్రి దశరథ్ జీ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, రైతులు, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని స్థానిక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.