**ఆసరా లేని జీవితాలకు చేయూత.. పేదల ఆశలకు భరోసా కడియం శ్రీహరి!**
వేలేరు, నవంబర్ 18:
హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండల కేంద్రం రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిరుపేదల సంక్షేమానికి, పింఛన్ల అందజేతకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాలపల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ కండువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి జీవితాల్లో ఆశలు నింపడంలో చేయూత పింఛన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిళ్ల యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రగొల్ల రమేష్, మార్కెట్ కమిటీ సభ్యులు కత్తి సంపత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, చేయూత పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

