కడకంచి శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ రామకృష్ణ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 18 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామానికి చెందిన కడకంచి శ్రీశైలం మరణించారు. ఆయన మృతి వార్త
విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఆయన నివాసానికి చేరుకున్నారు. శ్రీశైలం పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ, శ్రీశైలం మృతి గ్రామానికి తీరని లోటని అన్నారు. ఆయన గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థించారు. కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, వార్డు సభ్యులు వేల్పుల శోభారాణి, బత్తిని వేణు, గొరిగే సందీప్, గొరిగే సాయిలు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు నర్సింగ రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్, మాజీ ఎంపీటీసీ మోటే వీరస్వామి, నాయకులు గొరిగే మల్లయ్య, కొయ్యడ రామలింగం, కుర్రేముల రమేష్, జెగ్గం ఆనంద్, గడ్డం యాదగిరి, కడకంచి రాజకుమార్, బొజ్జం లక్ష్మణ్, నర్సింగ కిరణ్ తదితరులు పాల్గొని శ్రీశైలం చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.

