📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరేపు సంగారెడ్డిలో జరిగే దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర సభను జయప్రదం చేద్దాం

రేపు సంగారెడ్డిలో జరిగే దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర సభను జయప్రదం చేద్దాం

📰 Generate e-Paper Clip

రేపు సంగారెడ్డిలో జరిగే దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర సభను జయప్రదం చేద్దాం

సిద్ధిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు పాకాల జాకబ్

మద్దూరు నవంబర్17, ప్రజా వాణి,

నవంబర్ 18న సంగారెడ్డిలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర సభను జయప్రదం చేయాలని సిద్ధిపేట జిల్లా నాయకులు పాకాల జాకబ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పదవులు కల్పించి వారి సేవలను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఉదయం 10:30 గంటలకు నిర్వహించే రాష్ట్ర సభకు దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర గౌరవ సలహాదారులు దామోదర రాజనర్సింహ, వివేక్, వెంకట్ స్వామి, ఎంపీ రఘునందన్ రావులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ నాయకులు జిడికంటి సుధాకర్, మానేపల్లి ప్రభాకర్, ఏలూరి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.