గుంటూరు,నవంబర్ 16:ప్రజావాణి సమాజ సేవా రంగంలో విశేషంగా కృషి చేస్తూ,నిరుపేదలకు,ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మల్లవరపు చిన్ని జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఆల్ ఇండియా స్వచ్ఛంద సంస్థల సంక్షేమ సంఘం, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ సేవారత్న పురస్కారంతో సత్కరించారు.ఈ నెల 15వ తేదీన గుంటూరులో నిర్వహించిన ఎనిమిదవ సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనానికి మల్లవరపు చిన్నిని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి శాలువాతో ఘనంగా సత్కరించడంతో పాటు జాతీయ సేవారత్న పురస్కారాన్ని, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా మల్లవరపు చిన్ని మాట్లాడుతూ సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడం, నిరుపేదలకు మరియు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.తన సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో పురస్కారంతో సత్కరించిన ఆల్ ఇండియా స్వచ్ఛంద సంస్థల సంక్షేమ సంఘం, కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొడవటికంటి బాలరాజుకు,నిర్వాహకులకు, సంస్థ ప్రతినిధులకు మల్లవరపు చిన్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
జాతీయ సేవారత్న పురస్కారం అందుకున్న మల్లవరపు చిన్ని*
RELATED ARTICLES
