📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు స్వస్తి పలికి.. చట్టబద్ధమైన జీవనం సాగించాలి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు స్వస్తి పలికి.. చట్టబద్ధమైన జీవనం సాగించాలి

📰 Generate e-Paper Clip

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేరాలకు స్వస్తి పలికి.. చట్టబద్ధమైన జీవనం సాగించాలి

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 16 గుంటూరు, గుంటూరు జిల్లా

రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన , గుంటూరు జిల్లా పోలీసులు.

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇకపై ఎలాంటి నేరాలకు పాల్పడకుండా చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని పోలీసు అధికారులు సూచించారు.

కుటుంబ సభ్యుల భవిష్యత్తును, సమాజంలో తమ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని చెడు స్నేహాలు, అసాంఘిక కార్యకలాపాలు, నేరప్రవృత్తికి పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు.

ప్రజల ప్రశాంతతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, నేరప్రవృత్తి ఉన్నవారిపై గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తారని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదే సమయంలో నేరాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సమాజంలో ప్రశాంతంగా, చట్టబద్ధంగా జీవించే వారికి పోలీసుల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

నేరరహిత సమాజ నిర్మాణం, ప్రజలకు ప్రశాంతమైన మరియు సురక్షితమైన వాతావరణం కల్పించడమే గుంటూరు జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.