📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో అవినీతి ఆరోపణలు ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలి

కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో అవినీతి ఆరోపణలు ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలి

📰 Generate e-Paper Clip

కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో అవినీతి ఆరోపణలు
ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలి: యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్

ప్రజావాణి నవంబర్ 16

కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ తాడూరి రవీందర్ విధుల నిర్వహణలో అవినీతి, ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిధుల దుర్వినియోగం, నకిలీ బిల్లుల సృష్టి, ఉపాధ్యాయులకు జారీ చేసిన చెక్కుల నుంచి తిరిగి నగదు వసూలు చేయడం, మెస్ నిర్వహణలో అవకతవకలు, కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో ఒక్కో సీటుకు రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం శ్రీ పథకం నిధుల వినియోగం, విద్యార్థుల కోసం గీజర్ల ఏర్పాటు పేరుతో సేకరించిన నిధులు, పాఠశాల క్వార్టర్స్‌లో మద్యం సేవిస్తున్నారనే ఆరోపణలు, ఉపాధ్యాయుల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులపైనా సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు.

అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో అర్హత లేని సిబ్బందికి ఓటు హక్కు కల్పించారనే ఆరోపణలపై సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.

ప్రిన్సిపాల్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు పాఠశాలలో జరిగిన అన్ని ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని, ప్రతి ఆరోపణకు సంబంధించిన పత్రాలు, రికార్డులను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని దూడ శ్రీకాంత్ కోరారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విద్యాసంస్థల్లో ఆర్థిక, పరిపాలనా అవకతవకలకు అవకాశం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు రుజువైతే బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

విద్యాసంస్థల ప్రతిష్ఠను కాపాడటంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించాలని దూడ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ తిరుపతి గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రిక్కల నారాయణ రెడ్డి, నకీర్త రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.