జాతీయ సేవారత్న పురస్కారం అందుకున్న మల్లవరపు చిన్ని*

గుంటూరు,నవంబర్ 16:ప్రజావాణి సమాజ సేవా రంగంలో విశేషంగా కృషి చేస్తూ,నిరుపేదలకు,ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మల్లవరపు చిన్ని జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఆల్ ఇండియా స్వచ్ఛంద సంస్థల సంక్షేమ సంఘం, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ సేవారత్న పురస్కారంతో సత్కరించారు.ఈ నెల 15వ తేదీన గుంటూరులో నిర్వహించిన ఎనిమిదవ సమాజ సేవకుల ఆత్మీయ సమ్మేళనానికి మల్లవరపు చిన్నిని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి శాలువాతో ఘనంగా సత్కరించడంతో పాటు...