📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణహత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

• గౌరవ అధ్యక్షుడిగా కిషన్ రావు.. అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య.. ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య

• డీజేఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న

హత్నూర | నవంబర్ 15 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి

దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం, ఐక్యత, సామాజిక న్యాయం లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర్ మండల నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా డీజేఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వరిగుంతం శంకర్ వ్యవహరించారు.

నూతన కమిటీ మండల గౌరవ అధ్యక్షుడిగా మీనంపల్లి కిషన్ రావు, అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య, ఉపాధ్యక్షుడిగా నాయికోటి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య, సహాయ కార్యదర్శిగా కొండేగల్ల శ్రీధర్, కోశాధికారిగా బక్కోల్ల ప్రతాప్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బ్యాగరి శ్రీహరి, వరిగుంతం, ఆవుల మల్లేష్, నీరుడి మనోహర్, తూర్పాటి రమేశ్, బ్యాగరి పద్మారావు, నాయికోటి పవన్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సంఘం బలోపేతానికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

రాష్ట్ర మహాసభలకు తరలిరావాలి

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న మాట్లాడుతూ ఈ నెల 18న సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న డీజేఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దళిత జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివక్ష, ఆర్థిక, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమన్నారు. రాష్ట్ర మహాసభల్లో హక్కులు, సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి కీలక తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.