📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

📰 Generate e-Paper Clip

*ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి*

*లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి*

జహీరాబాద్ టౌన్, నవంబర్ 15 (ప్రజావాణి): పట్టణంలో ఆదర్శనగర్ కాలనీ డా సిద్దం ఉజ్వల్ రెడ్డి నివాసంలో సోమవారం పట్టణం మరియు న్యాల్కల్, మొగుడంపల్లి, కోహిర్, జహీరాబాద్ మండల చెందిన 23 మంది లబ్ధిదారులకు 7,80,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కును సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు. ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ, సెట్విన్ చైర్మన్ యన్ గిరిధర్ రెడ్డి, డా సిద్దం ఉజ్వల్ రెడ్డి లకు చెక్కులు పొందిన లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ యూనస్ మున్సిపల్ కౌన్సిలర్స్ నిజాం, సీనియర్ నాయకులు పట్లోళ్ళ. శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, భీమయ్య, అశ్విన్, కిరణ్ గౌడ్, దిలీప్, జహీర్ హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.