ఉస్మానియా యూనివర్సిటీ లో..
ఘనంగా గుట్టయ్య గౌడ్ బర్త్ డే వేడుకలు.
ప్రజావాణి,నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, నెల్లికుదురు మండలం నైనాల గ్రామ ముద్దుబిడ్డ మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ బర్త్ డే వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ లో శనివారం ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సెలబ్రేషన్ కు బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశ హాజరయ్యారు.గుట్టయ్య గౌడ్ తో పాటు,అతిథులు జన్మదిన కేకును కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా దిశ, మానుకోట మాజీ సర్పంచి భూక్య నెహ్రూ నాయక్ ప్రభృతులు మాట్లాడుతూ గుట్టయ్య గౌడ్ మంచి ఆరోగ్యంతో మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పరుగులు పెడుతూ, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.గుట్టయ్య గౌడ్ ప్రజాసేవలో మరింత రాణించాలని పాట పాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలోట్రైబల్ జేఏసీ నాయకులు రవీందర్ రాథోడ్, సురేష్ నాయక్, భాస్కర్ నాయక్, నరేష్ నాయక్, లక్ష్మణ్ ముదిరాజ్తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

