*పోతేపల్లిలో అంగరంగ వైభవంగా సర్పంచ్ ఆధ్వర్యంలో యాదవుల సదర్ ఉత్సవాలు..*
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం:
నవంబర్ 13/ప్రజావాణి ప్రతినిధి..
యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి – *గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్*
పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. యాదవుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను గ్రామంలో విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుండి కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. సదర్ పండుగ యాదవుల ఐక్యతకు, సామాజిక చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని ఈ సందర్భంగా సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ పేర్కొన్నారు.
యాదవుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కుల ఐక్యతను మరింత బలోపేతం చేసుకుంటూ, సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో యాదవులు మరింత అభివృద్ధి

