📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాగిల్లాపూర్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్

గాగిల్లాపూర్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్

📰 Generate e-Paper Clip

గాగిల్లాపూర్ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్

బెజ్జంకి,నవంబర్ 13 (ప్రజావాణి)

మానకొండూర్ శాసనసభ్యులు,ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు.బెజ్జంకి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిని ప్రశాంత్,గాగిల్లాపూర్ సర్పంచ్ ఎర్రల జానకిరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ ఎస్సీ సెల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా కల్లేపల్లి సంపత్, ప్రధాన కార్యదర్శిగా న్యాలం శశి, ఉపాధ్యక్షుడిగా ఎర్రల రఘు ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కల్లేపల్లి సంపత్ మాట్లాడుతూ, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆశయాలకు అనుగుణంగా దళితుల సంక్షేమం,వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని,గ్రామ అభివృద్ధిలో ఎస్సీ సెల్ కీలక పాత్ర పోషించేలా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగుతానన్నారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, మండల కార్యదర్శి పైడిపల్లి శంకర్, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, చింతలపల్లి లత కొండల్ రెడ్డి, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు దొరగోల్ల సంతోష్, ఎర్రల రవీందర్, కొమిరే శ్యామ్, నాయకులు, ఎస్సీ సెల్ ప్రతినిధులు,యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.