📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవేలేరు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం

వేలేరు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం

📰 Generate e-Paper Clip

**వేలేరు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం**

వేలేరు:
వేలేరు మండల కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నూతన మండల కార్యవర్గాన్ని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురావత్ లక్ష్మణ్ నాయక్ గురువారం నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లికొండ రాజు, రఘునాయకుల శ్రీధర్ రెడ్డి, రేగుల సురేందర్ రెడ్డి, జిట్టబోయిన మల్లయ్య, తోటి పురుషోత్తంలను నియమించారు.

ప్రధాన కార్యదర్శులుగా కూరపాటి రమేష్, బైరి శ్రీనివాస్, మునిగడుపు కేశారి, టోజ్ అశోక్, తుమ్మల ప్రశాంత్‌లకు బాధ్యతలు అప్పగించారు.

అదేవిధంగా కార్యదర్శులుగా ఈడబోయిన సవిన్, మిలుబారి సందీప్, కన్నబోయిన సంపత్, గూటం రాజులను, కార్యవర్గ సభ్యులుగా మద్దారి కోమల, వెన్నం సంపత్ రెడ్డి, బొచ్చు త్రావణి, సునావత్ రాజమ్మ, గుండ్ల శంకరయ్య, నీలం కోమరమ్మ, అల్లి రాజేశ్వరి, కొప్పుల అమావాస్య, గూటం కృష్ణవేణిలను నియమించినట్లు ప్రకటించారు.

నూతనంగా నియమితులైన నాయకులు పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.