పోతేపల్లిలో అంగరంగ వైభవంగా సర్పంచ్ ఆధ్వర్యంలో యాదవుల సదర్ ఉత్సవాలు..
*పోతేపల్లిలో అంగరంగ వైభవంగా సర్పంచ్ ఆధ్వర్యంలో యాదవుల సదర్ ఉత్సవాలు..* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం: నవంబర్ 13/ప్రజావాణి ప్రతినిధి.. యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి – *గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్* పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా, అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. యాదవుల సంప్రదాయాలు, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను గ్రామంలో విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ ప్రత్యేక...