నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలు జయప్రదం చేయండి.
రైతు పోరాటాలకు కార్మిక వర్గం మద్దతు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి.
మద్దూరు నవంబర్13, ప్రజా వాణి,
నవంబర్ 15 నుండి 18 వరకు జరుగు అఖిలభారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా బహిరంగ సభలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిపల్లి సత్తిరెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా
దూల్మిట్ట మండల కేంద్రంలో హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రైతు మహాసభలు జయప్రదం చేయాలని గోడపత్రిక ఆవిష్కరణ చేసి సంఘీభావం తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక భూమిక పోషించిన నల్లగొండ జిల్లా కేంద్రంలో 36వ జాతీయ రైతు మహాసభలు జరగడం అభినందనీయమని అన్నారు రైతాంగం చేస్తున్న పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు ఉంటుందని కార్మిక కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నికరమైన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక ఐక్య పోరాటాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు నలగొండ నగరానికి వస్తున్న జాతీయ నాయకులకి స్వాగతం పలుకుతూ కార్మిక వర్గం బహిరంగ సభలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు మండల కన్వీనర్ పోతిరెడ్డి రాజు, చొప్పరి ప్రసాద్, రమేష్, ప్రభాకర్, దేవులపల్లి మల్లయ్య, కొలిపాక రాజు తదితరులు పాల్గొన్నారు.


