శ్రీ ఎల్లమ్మ ఆలయంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
భక్తిశ్రద్ధలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు, భక్తులు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 13
పెద్దపల్లి: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన నాగదేవతకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగదేవతకు పూలు, పాలు, పండ్లు సమర్పించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సంతానం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మహిళలు భక్తిప్రపత్తులతో నాగదేవతను పూజించారు.
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొనగా, నాగదేవతకు ప్రత్యేక పూజలు, పాలు సమర్పించేందుకు భక్తులు బారులుతీరారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తి వాతావరణంతో కళకళలాడాయి.

