-ప్రజావాణి న్యూస్ కథనానికి వచ్చిన అధికారులు స్పందించారు
-మిర్యాలగూడ
సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12
మిర్యాలగూడ సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ! బియ్యం తూకం వేసిన తర్వాతే రషన్ దుకాణాలకు సరఫరా చేయాలని అధికారుల ఆదేశాలు!
మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో బియ్యం తూనికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ “ప్రజావాణి మిర్యాలగూడ స్టాఫ్ రిపోర్టర్ కలకొండ హరీష్ ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.
అధికారుల ఆకస్మిక తనిఖీ: ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారులు రాంపతి నాయక్, వెంకటేష్ గోదాంలోని బియ్యం నిల్వలు, తూనికల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.
అధికారిక ఆదేశాలు: బియ్యం బస్తాలను తూకం వేసిన తర్వాతే రషన్ దుకాణాలకు సరఫరా చేయాలని గోదాం సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
డీలర్లతో చర్చలు: ఈ సందర్భంగా రషన్ డీలర్లతో మాట్లాడిన అధికారులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూనికల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
పాల్గొన్న వారు: ఈ తనిఖీలో గోదాం ఇన్చార్జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డీటీ సైదులు, ఆర్ఐ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

