prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 9:29 am Digital Edition : PRAJA VANI

ప్రజావాణి న్యూస్ కథనానికి వచ్చిన అధికారులు స్పందించారు

-ప్రజావాణి న్యూస్ కథనానికి వచ్చిన అధికారులు స్పందించారు

-మిర్యాలగూడ
సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 12

​ మిర్యాలగూడ సివిల్ సప్లై గోదాంలో జిల్లా అధికారుల ఆకస్మిక తనిఖీ! బియ్యం తూకం వేసిన తర్వాతే రషన్ దుకాణాలకు సరఫరా చేయాలని అధికారుల ఆదేశాలు!
​ మిర్యాలగూడ పట్టణంలోని సివిల్ సప్లై గోదాంలో బియ్యం తూనికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ “ప్రజావాణి మిర్యాలగూడ స్టాఫ్ రిపోర్టర్ కలకొండ హరీష్ ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.
​అధికారుల ఆకస్మిక తనిఖీ: ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల అధికారులు రాంపతి నాయక్, వెంకటేష్ గోదాంలోని బియ్యం నిల్వలు, తూనికల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు.
​అధికారిక ఆదేశాలు: బియ్యం బస్తాలను తూకం వేసిన తర్వాతే రషన్ దుకాణాలకు సరఫరా చేయాలని గోదాం సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
​డీలర్లతో చర్చలు: ఈ సందర్భంగా రషన్ డీలర్లతో మాట్లాడిన అధికారులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూనికల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
​పాల్గొన్న వారు: ఈ తనిఖీలో గోదాం ఇన్చార్జి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డీటీ సైదులు, ఆర్‌ఐ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.