📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.

📰 Generate e-Paper Clip

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.
ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు..
ప్రాణ దాతలుగా నిలిచిన ‘108’ సిబ్బంది.

​ఏటూరునాగారం నవంబర్ 11 ప్రజావాణి:

రహదారి ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమై, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ముగ్గురు యువకులకు 108 అత్యవసర వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ప్రాణదానం చేశారు. సమయస్ఫూర్తితో ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.
​సంఘటన వివరాలు: గండికోట అఖిల్ 23, ఆలకుంట లోకేష్ 26, గుంజ సుధాకర్ 33 అను ముగ్గురు వ్యక్తులు పసర నుండి తమ స్వగ్రామమైన వెంగళపురం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులను, మేడారం దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద ధాటికి బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయారూ.తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

​ *దేవుళ్లలా వచ్చి.. ప్రాణం నిలిపి:*
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘108’ అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఈ ఏం టి శివలింగంప్రసాద్,పైలట్ యాకూబ్ పాషా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరిశీలించారు. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాహనంలోనే ప్రాథమిక అత్యవసర చికిత్స అందించి, రక్తం నిలిచేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం వారిని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు.
​సకాలంలో స్పందించి వైద్యం అందించడంతో యువకుల ప్రాణాలు నిలిచాయని వైద్యులు తెలిపారు. చావుబతుకుల మధ్య ఉన్న యువకులను కాపాడి, తమ పట్ల ఆపద్బాంధవులుగా నిలిచిన 108 ఈఎంటి మరియు పైలట్ (డ్రైవర్) సమయస్ఫూర్తిని, సేవలను స్థానికులు మరియు గాయపడిన యువకుల కుటుంబ సభ్యులు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.