📄 ePaper
Epaper 2
Thursday, November 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పోరుమామిళ్ల జూనియర్ కాలేజ్ గ్రౌండ్!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పోరుమామిళ్ల జూనియర్ కాలేజ్ గ్రౌండ్!

📰 Generate e-Paper Clip

మద్యం సీసాలు,చెత్తాచెదారంతో కంపుకొడుతున్న క్రీడా మైదానం.భయాందోళనలో వాకర్లు,క్రీడాకారులు పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 12 ప్రజావాణి ఎంతో మంది క్రీడాకారులను, ఆర్మీ మరియు పోలీస్ ఉద్యోగులను సమాజానికి అందించిన ఘన చరిత్ర కలిగిన పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నేడు అసాంఘిక కార్యకలాపాలకు,చెత్తాచెదారానికి నిలయంగా మారింది. కళాశాల ఆవరణలోని మైదానంలో ఎక్కడ చూసినా పగిలిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తుండటంతో స్థానికులు,వాకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన వైనం

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరోగ్య రక్షణ కోసం ఈ మైదానానికి వచ్చే మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్లు ఇక్కడి పరిస్థితిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయంత్రం కాగానే మందుబాబులు మైదానాన్ని తమ అడ్డాగా మార్చుకుని మద్యం సేవిస్తున్నారు. తాగిన తర్వాత ఖాళీ సీసాలను అక్కడే పడేయడం, కొన్నిసార్లు పగలగొట్టడం వల్ల ఉదయాన్నే నడకకు వచ్చే వారికి, వ్యాయామం చేసే యువతకు గాయాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. మహిళలు, వృద్ధులు ఈ మైదానంలోకి అడుగుపెట్టాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.

అద్దె వసూలు సరే.శుభ్రత ఏది?

మరోవైపు, కళాశాల మైదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు,వివిధ కార్యక్రమాలకు అద్దెకు ఇస్తున్నారని,అయితే ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నిర్వాహకులు చెత్తాచెదారాన్ని శుభ్రం చేయకుండా అలాగే వదిలేసి వెళ్లిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.మైదానం అంతా ప్లాస్టిక్ కవర్లు,చెత్తతో నిండిపోయి అధ్వానంగా తయారైంది.

అధికారులు, ప్రిన్సిపాల్ తీరుపై అసహనం

ఈ దుస్థితిపై వాకర్లు, క్రీడా ప్రేమికులు కళాశాల యాజమాన్యం మరియు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైదానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చి ఆదాయం పొందడమే కాకుండా, దాని నిర్వహణ మరియు శుభ్రతపై కూడా కళాశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో మంది భవిష్యత్తుకు బాటలు వేసిన ఈ పవిత్ర క్రీడా ప్రాంగణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ స్పందించి తక్షణమే మైదానంలోని చెత్తను, మద్యం సీసాలను తొలగించాలని, సాయంత్రం వేళల్లో మందుబాబుల ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి, వాకర్లకు మరియు క్రీడాకారులకు రక్షణ కల్పించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.