పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 12:ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) తమ సర్పంచ్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. పార్టీ కవలకుంట్ల ఇన్చార్జిలు ప్రభాకరయ్య, నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వీరపోగు సురేష్ (గ్యాస్) పేరును సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా కవలకుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ ఇన్చార్జిలు ప్రభాకరయ్య, నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా వీరపోగు సురేష్‌కు మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు.ప్రజల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న నాయకుడిని గెలిపించుకుంటేనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అభిప్రాయపడ్డారు.రాబోయే ఎన్నికల్లో సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కవలకుంట్ల గ్రామ ప్రజలందరికీ పిలుపునిచ్చారు.నాయకుల పిలుపు మేరకు సమావేశానికి హాజరైన గ్రామస్తులు,పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.వీరపోగు సురేష్ అభ్యర్థిత్వానికి తామంతా సంపూర్ణ మద్దతు ఇస్తామని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో తెలిపారు.రానున్న ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి,సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్ పీఠంపై కూర్చోబెడతామని వారందరూ హామీ ఇచ్చారు.అనంతరం సర్పంచ్ అభ్యర్థి వీరపోగు సురేష్ మాట్లాడుతూ.తనపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ ఇన్చార్జిలు ప్రభాకరయ్య,నాగార్జున రెడ్డిలకు,అలాగే తనకు అండగా నిలుస్తున్న గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత కవలకుంట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెన్ను రాజశేఖర్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు,స్థానిక కార్యకర్తలు,గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కవలకుంట్ల వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా వీరపోగు సురేష్ ఖరారు
RELATED ARTICLES

