📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి*
.సిపిఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి.

*గోవిందరావుపేట/ములుగు ప్రతినిధి (ప్రజావాణి)*:-

గోవిందరావుపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం పసర గ్రామంలో గాంధీనగర్ సమీప మైదానంలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజుతో కలిసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సుమారు 15 లారీల ధాన్యం ఆరబోసి రోజులు గడుస్తున్నా కేంద్రం ప్రారంభించలేదని రైతులు వాపోయారు.
ఇది ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోందని మల్లారెడ్డి విమర్శించారు.
మండలంలో సగం పంట మాత్రమే పండితే, ఆ సగం పంటను కూడా కొనలేకపోవడం విచారకరమన్నారు.
పీఏసీఎస్, మహిళా సంఘాలకు కేంద్రాలు కేటాయించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నా ప్రారంభించకపోవడంపై ప్రశ్నించారు.
ప్రతిరోజూ రైస్ మిల్ వ్యాపారులు క్వింటాకు రూ.2800 నుంచి రూ.2900 ఇస్తామని తిరుగుతున్నారని తెలిపారు.
వారిని కాపాడేందుకే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న అనుమానం వస్తోందన్నారు.
ఉరుములు, మెరుపులు, మబ్బులు, తుఫాన్లతో రైతులు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులకు ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించారు.
పది రోజులుగా పరదాల కిరాయి కూడా రైతుల నెత్తిన పడుతోందని తెలిపారు.
దళారులకు అవకాశం ఇవ్వకుండా అధికారులు వెంటనే స్పందించి కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
లేకపోతే రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మల్లారెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.