📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిసిపిసి చైర్మన్ కన్వీనర్లుగా వెంకన్న విజయ

విసిపిసి చైర్మన్ కన్వీనర్లుగా వెంకన్న విజయ

📰 Generate e-Paper Clip

విసిపిసి చైర్మన్ కన్వీనర్లుగా వెంకన్న విజయ
ప్రజావాణి,నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు అంగన్వాడి సెక్టార్ కు చెందిన నెల్లికుదురు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి) చైర్మన్ గా సర్పంచి పులి వెంకన్న, కన్వీనర్ గా స్థానిక అంగన్వాడి టీచర్ మద్ది విజయ లు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్.సరిత సమక్షంలో స్థానిక జడ్పిహెచ్ఎస్ లో మంగళవారం 15 మంది సభ్యులతో విసిపిసి కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ పిల్లలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి సంబంధిత కమిటీ దోహదపడుతుందన్నారు. బాలల అక్రమ రవాణ,బాల్యవివాహాల నిర్మాన వంటివి నిరోధిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచి వెంకన్న,హెచ్ఎం జలగం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి దేవయ్య,ఉపసర్పంచ్ మంచాల వెంకన్న,ఎఎపిసి చైర్మన్ మమత, జహీర్ పాషా,
అంగన్వాడీ టీచర్స్,ఐ.పద్మ,ఎం.పద్మ,కె.పద్మ,టి.జ్యోతి, మాధవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

*దుర్గ భవాని తండా విసిపిసి కమిటీ ఎన్నిక..*

మండలంలోని దుర్గాభవాని తండా విసిపిసి కమిటీని ఐసిడిఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్.సరిత ఆధ్వర్యంలో భగ్న తండా పాఠశాలలో ఎన్నుకున్నారు. విసిపిసి చైర్మన్గా స్థానిక సర్పంచి వీరన్న నాయక్, కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ బి.పద్మ లతో కూడిన 15 మంది సభ్యుల కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం యశోద, ఆశా కార్యకర్త విజయ బాలల సంఘం సభ్యులు కావ్య,అంగన్వాడీ టీచర్ సునిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.