ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

*ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి* .సిపిఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి. *గోవిందరావుపేట/ములుగు ప్రతినిధి (ప్రజావాణి)*:- గోవిందరావుపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పసర గ్రామంలో గాంధీనగర్ సమీప మైదానంలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజుతో కలిసి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 15 లారీల ధాన్యం ఆరబోసి రోజులు గడుస్తున్నా కేంద్రం ప్రారంభించలేదని...