📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎలినినో ప్రభావంతో తక్కువ నీటినీ వాడుకుంటూ... పంట మార్పిడి పంటలు సాగు చేయాలి

ఎలినినో ప్రభావంతో తక్కువ నీటినీ వాడుకుంటూ… పంట మార్పిడి పంటలు సాగు చేయాలి

📰 Generate e-Paper Clip

ఎలినినో ప్రభావంతో తక్కువ నీటినీ వాడుకుంటూ… పంట మార్పిడి పంటలు సాగు చేయాలి

శాస్త్రవేత్త శ్వేత..మండల ఉద్యాన శాఖ అధికారినీ కౌసల్య,

మద్దూరు నవంబర్10, ప్రజా వాణి,

ధూలిమిట్ట మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం మండల ఉద్యాన అధికారిని కౌసల్య రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్త శ్వేత మాట్లాడుతూ ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో ఉన్న నీరుని జాగ్రత్తగా వాడుకుంటూ,పాటించవలసిన జాగ్రత్తలు, పంట మార్పిడి ఉపయోగం వివరించారు. ఆయిల్ పామ్ తోటలో ప్రస్తుతం మల్చింగ్ వేసుకోవాలని వివరించారు.మండల ఉద్యాన అధికారిని కౌసల్య మాట్లాడుతూ,ఉద్యాన పంటల లాభాలు వాటి నుండి వచ్చే దిగుబడిని వివరించారు.ఒక ఎకరం వరి సాగుకు అవసరం అయ్యే నీరుతో 3 ఎకరాల వరకు కూరగాయలు సాగు చేయవచ్చు.పంట మార్పిడి చేసుకొని రైతులు పండ్ల తోటలు, కూరగాయల తోటలు పండించాలి అని కోరారు.ఎండ ప్రభావం,నేల తడిని కాపాడుకోవడం,సమయానికి ఎరువులు వేయటం,సూక్ష్మ పోషకాల ఉపయోగాలు, యాజమాన్య పద్ధతులు వివరించారు.దీనికి ఉద్యాన శాఖ వారిచే అందించే సబ్సిడీ వివరించారు.ఆయిల్ పామ్ తోటలో నాలుగవ సంవత్సరం తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పైన కూడ రైతులకి ఉన్న సందేహాలకి సూచనలు ఇచ్చారు. ఆయిల్ పామ్ పంట 30 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. ఉద్యాన శాఖ వారిచే మొక్కలు, డ్రిప్ సబ్సిడీలో అందించబడుతుంది.మొదటి 4 సంవత్సరాలు అంతర పంటలతో లాభం పొందవచ్చన్నారు.అంతర పంటలకు, ఫెర్టిలైజర్స్ కి ఎకరానికి 4200, 4 సంవత్సరాల పాటూ అందజేయటం జరుగుతుందన్నారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ ధర 22000 రూపాయలు ఉంది.ఈ సమావేశంలో సర్పంచ్ గునుకుల లీలా,మండల ఉద్యాన శాఖ అధికారిని కౌసల్య,శాస్త్రవేత్త శ్వేత, వ్యవసాయ విస్తరణ అధికారులు రాధిక, అఖిల్, ఆయిల్ఫేడ్ ఫీల్డ్ ఆఫీసర్ రాకేష్, ఫినాలెక్స్ డ్రిప్ జిల్లా అధికారి నరేష్,రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.