📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్

మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్

📰 Generate e-Paper Clip

మేడ్చల్, నవంబర్ 10: మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎరుముల సురేష్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎరుముల సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్మికులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని వారు సూచించారు. అనంతరం మేడ్చల్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ మాట్లాడుతూ, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే తత్వం, కార్మిక వర్గాల సమస్యలపై మంచి అవగాహన ఉన్న నాయకుడు ఎరుముల సురేష్ అని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని తెలిపారు. నూతన అధ్యక్షుడు ఎరుముల సురేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ ముఖ్య నాయకులకు, తనకు సహకరించిన కార్మిక సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్మికుల పక్షాన నిలిచి, వారి హక్కులు మరియు న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు సంబు ప్రభాకర్, నాయకులు చిన్న, యాదగిరి, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, నవీన్, నారాయణ గౌడ్, మూర్తి, వెంకట్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.