*మతం కంటే మనవత్వం గొప్పది*
*సర్వమత సమ్మేళనం భారతదేశం*
*దారూర్ జాతర పాదయాత్రికులకు నామ సుభద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అండ*
జహీరాబాద్. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తూ దారూర్ జాతరకు వెళ్తున్న క్రైస్తవ భక్తులకు నామా సుభద్రమ్మ ట్రస్ట్ అండగా నిలిచింది. దారూర్ జాతరలో పాల్గొనేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో కాలిబాటన పాదయాత్రగా వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం బంటారం సమీపంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి నడిచి వస్తున్న యాత్రికుల అలసటను తీర్చేందుకు నామా సుభద్రమ్మ ట్రస్ట్ తరపున నామ అయాన్స్ స్వయంగా దగ్గరుండి, భక్తులందరికీ బాదం పాలు, బిస్కెట్లు, అలాగే మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. జనహితమే లక్ష్యంగా, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ సర్వమత భావనను చాటుతూ నామ సుభద్రమ్మ ట్రస్ట్ చేపట్టిన ఈ ఉచిత పంపిణీ కార్యక్రమం దారిన వెళ్తున్న పాదయాత్రికులకు ఎంతో ఊరటనిచ్చింది.

